అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలు భారత్ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భారత్ లోని మొత్తం ఎగుమతుల్లో సేవారంగ ఎగుమతులు 40-45 శాతం వరకు ఉన్నాయి. ఇక మొత్తం సేవల్లో 50-60 వరకూ అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. అయితే H1B వీసాల ఆంక్షల నేపథ్యంలో ఇండియాలోని ఐటీ రంగం కుదేలయ్యే పరిస్థితి నెలకొందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. H1B వీసాపై ఆంక్షలు భారత్ పై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉందని భారత ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్ చెప్పారు.
భారత్ -అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పటీకి పటిష్టంగా ఉండాలని, అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెడుతున్న భారత కంపెనీలకు తాము అమితమైన గౌరవం ఇస్తామన్నారు. అవి తమ దేశంలో అనేక ఉద్యోగాలు సృష్టిస్తున్నాయన్నారు. ఈ గౌరవంతో వాటికి కొత్తగా వీసాలు కావాలంటే దానిని పరిగణనలోకి తీసుకొంటామని ఆర్థిక శాఖ తాత్కాలిక కార్యదర్శి మార్క్ టోనర్ చెప్పారు.