సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనను భారత్ ఘనంగా విజయం తో ఆరంభించింది. నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో ఘన విజయాన్ని నమోదుచేసింది. చైనామన్ కుల్దీప్ యాదవ్ (5/17) మ్యాజిక్ బౌలింగ్‌కు తోడు కేఎల్ రాహుల్ (54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 నాటౌట్) క్లాస్ శతకం తోడవ్వడంతో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది.
ఈ విజయం మూడు టీ20ల సిరీ్‌సలో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. కుల్దీప్ ధాటికి ఓపెనర్లు బట్లర్ (46 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 69), జేసన్ రాయ్ (20 బంతుల్లో 5 ఫోర్లతో 30) మినహా అంతా విఫలమయ్యారు.
ఏకంగా ఏడుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఐదు వికెట్లు తీసిన తొలి ఎడమచేతి చైనామన్ బౌలర్‌గా కుల్దీప్ నిలిచాడు. ఉమేశ్‌కు రెండు వికెట్లు దక్కా యి. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 163 పరుగులు చేసి నెగ్గింది. రోహిత్ (32) ఫర్వాలేదనిపించాడు.