భారత ఫుట్‌బాల్ జట్టు మెరుగైన ప్రదర్శనతో విజయాలు సాధిస్తూ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ముందుకుసాగుతొంది. 21 ఏళ్లలో తొలిసారి టాప్-100లో చోటు సంపాదించింది. తాజా ర్యాంకింగ్స్‌లో వందో స్థానంలో నిలిచింది. 1996 ఏప్రిల్‌లో భారత జట్టు వందో ర్యాంకు దక్కించుకుంది. ఫిబ్రవరిలో అత్యుత్తమ ర్యాంకు 94. 1996 ను అందుకుంది. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో మయన్మార్‌పై విజయం.... ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కంబోడియాపై గెలుపు భారత ర్యాంకింగ్ పెరుగుపడేందుకు ఉపకరించాయి.