//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విమానయానంలో తిరిగి అగ్రగామిగా భారత్

Category : business

స్వదేశీ విమానయానం వృద్ధిలో రెండు నెలల విరామం తరువాత భారత్ తిరిగి ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది. మార్చ్, 2017 వరకు 23 నెలలుగా భారత్ లో వృద్ధి ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటూ వచ్చింది. అయితే ఆ తరువాత  మార్చ్ లో మూడో స్థానంకు చేరుకొంది. ఏప్రిల్ లో రెండో స్థానంలోకి రాగా, మే లో తిరిగి మొదటి స్థానంకు చేరుకొంది.

ప్రపంచంలో విమాన ప్రయాణికులు ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా,జపాన్, రష్యా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ కూడా ఉంది. అంతర్జాతీయ విమాన రవాణా సంఘం గణాంకాల ప్రకారం ఏప్రిల్ లో 15.3 శాతం ఉన్న వృద్ధి మే లో 17.7 శాతంకు చేరుకొంది. అన్ని ప్రధాన విమాన ప్రయాణ మార్కెట్ ల కన్నా ప్రయాణికుల సంఖ్య, అందుబాటులో ఉన్న విమాన సీట్ల సంఖ్య విషయంలో భారత్ మొదటి స్థానంలో ఉన్నది.

గత సంవత్సరం ఇదే సమయం కన్నా ప్రయాణికుల సంఖ్య  మే లో 17 శాతం పెరిగింది. అట్లాగే ప్రయాణికుల సంఖ్య  మే లో 14.7 శాతం పెరిగింది. ఇదే సమయంలో చైనా లో 14.4 శాతం, రష్యా లో 12.6 శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా మే లో ప్రయాణికుల శాఖ 7.7 శాతం పెరుగగా, సీట్ల సంఖ్య 6.1 శాతం పెరిగింది.