//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన భార‌త్‌... పాక్ తో పోరుకు సిద్ధం

Category : sports

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ రెండో సెమీఫైన‌ల్‌లో బంగ్లాదేశ్‌పై 9 వికెట్ల తేడాతో భార‌త్ 265 ఘ‌న‌విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు దూసుకుళ్లింది. ఈ నేప‌ధ్యంలో ఈ నెల 18న లండన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో టీమిండియా - పాకిస్ధాన్ జ‌ట్ల మ‌ధ్య ఉత్కంఠ భ‌రిత‌మైన పోరు జ‌ర‌గ‌నుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 264 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కేవ‌లం 40.1 ఓవ‌ర్ల‌కు ఒక వికెట్ కోల్పోయి 265 ప‌రుగుల‌తో రెండో సెమీఫైన‌ల్‌లో బంగ్లాపై విజ‌య భేరీ మోగించి 18న జ‌రిగే ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో దూసుకెళ్లింది. 

శిఖ‌ర్ ధావ‌న్ 34 బంతుల్లో 46 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. రోహిత్ శ‌ర్మ 129 బంతుల్లో 123 ప‌రుగులు (నాటౌట్‌), కెప్టెన్ విరాట్ కోహ్లీ 78 బంతుల్లో 96 ప‌రుగులు చేసి విజ‌యం సాధించే వ‌ర‌కూ పోరాడారు. బుధ‌వారం ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ తొలి సెమీఫైన‌ల్‌లో ఇంగ్లాండ్ జ‌ట్టుపై పాకిస్ధాన్ గెలుపు సాధించి ఫైన‌ల్‌కు చేరిన విష‌యం విధిత‌మే. 

భారత బ్యాట్స్‌మెన్లు శిఖర్ ధావన్ 46 పరుగులు చేసి ఔటవ్వగా.. రోహిత్‌శర్మ 123 పరుగులు(129 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్) విరాట్ కోహ్లీ 96 పరుగుల(78 బంతుల్లో 13 ఫోర్లు)తో నాటౌట్‌గా నిలిచారు.