క్రికెట్ లో ఘోర పరాజయం ఎదురైనా, ప్రపంచ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ భారీ విజయాన్ని సాధించింది. వరుసగా మూడో విజయంతో ప్రపంచ హాకీ సెమీస్ లీగ్‌లో భారత్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. ఆకాశ్ దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, తల్విందర్ సింగ్‌లు చెరో రెండేసి గోల్స్‌తో పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు.
మధ్యలో రమణదీప్ సింగ్ ఓ గోల్ చేయడంతో భారత్ అలవకోగా పాక్‌ను మట్టి కరిపించింది.ఫెనాల్టీని హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలచి భారత్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. తల్విందర్ సింగ్ ఫీల్డ్‌గోల్‌తో భారత్‌ను 2-0 ఆధిక్యంలో నిలిపాడు. హాకీ లీగ్‌లో భారత్ యువ ఆట గాళ్ల ప్రతిభను మరింత పదును పెట్టడంతో పాటు ర్యాంకింగ్స్‌ను మెరుగు పర్చుకునేందుకు ఉపకరించనుంది.
ఆతిథ్య జట్టుగా భారత్ ప్రపంచ హాకీ లీగ్, ప్రపంచ కప్‌లో నేరుగా పాల్గొనే అర్హత కలిగి ఉంది. తాజాగా లండన్‌లో జరుగుతున్న సెమీఫైనల్స్ టోర్నీ నుంచి ఐదు జట్లు వచ్చే ఏడాది భారత్‌తోని భువనేశ్వర్ జరిగే ప్రపంచ హాకీ లీగ్‌కు అర్హత సాధిస్తాయి. హాకీ లీగ్‌లో తొలి మ్యాచ్‌లో 4-1తో స్కాట్లాండ్ను ఓడించిన భారత్,శనివారం తన రెండో మ్యాచ్‌లో కెనడాపై 3-0తో జయభేరి మోగించిన విషయం తెల్సిందే.
శనివారమే కెనడాపై 6-0తో జయభేరి మోగించిన దాయాది పాకిస్తాన్ మాత్రం భారత చేతిలో ఘోరంగా ఓటమి పాలవ్వడం విశేషం. ఇటీవల కాలంలో పాకిస్తాన్ భారీ విజయం సాధించడం ఇదే ప్రధమం. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ 3-2తో పాక్‌పై ఘన విజయం సాధించింది. అంతకు ముందు సుల్తాన్ ఆజ్లాన్ షా హాకీ టోర్నీలో భారత్ పాకిస్తాన్‌పై 5-1తో భారీ విజయాన్ని సాధించింది. 1982లో ఆసియన్ గేమ్స్‌లో పాక్ చేతిలో ఘోరంగా ఓడిన భారత్ ఇన్నాళ్లకు ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.