//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ద్విచక్ర వాహన విక్రయాల్లో అతిపెద్ద మార్కెట్‌గా భారత్

Category : national business

ద్విచక్ర వాహన విక్రయాల్లో చైనాను వెనుకకు నెట్టిన భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వద్దనున్న సమాచారం ప్రకారం.. గత ఏడాది మన దేశంలో 1.77 కోట్ల టూవీలర్లు అమ్ముడుపోయాయి. అంటే, సరాసరిగా రోజుకు సంస్థలు 48,000 యూనిట్లను విక్రయించాయన్నమాట. ఇక చైనా అసోసియేషన్ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ వద్దనున్న డాటా ప్రకారం.. గత సంవత్సరం వారి దేశంలో 1.68 కోట్ల టూవీలర్లు అమ్ముడయ్యాయి. దేశంలో ప్రజల ఆదాయ స్థాయి గణనీయంగా పెరుగడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతులు మెరుగుపడుతుండటం ద్విచక్ర వాహన విక్రయాల్లో వృద్ధికి ప్రధానంగా దోహదపడింది. మహిళా వాహన చోదకుల సంఖ్య పెరుగుతుండటంతో స్కూటర్ల అమ్మకాలు భారీగా పుంజుకోవడం కూడా కలిసివచ్చింది. స్కూటర్ల విభాగంలో అధిక మార్కెట్ వాటా కలిగిన హోండా సంస్థ కస్టమర్లలో మహిళల వాటా 35 శాతంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. అదే చైనా విషయానికొస్తే.. గత కొన్నేండ్ల నుంచి అక్కడి మార్కెట్లో టూవీలర్ విక్రయాలు తగ్గుకుంటూ వస్తున్నాయి. కార్ల వినియోగం పెరుగడం, కొన్ని నగరాల్లో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించడం అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం.