//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విమాన ప్రయాణాల్లో 'నో ఫ్లై లిస్ట్' రూల్స్

Category : national

విమాన ప్రయాణాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో పౌర విమాయాన శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. వివాదాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకునేందుకు అనర్హత జాబితా (నో ఫ్లై లిస్ట్) విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను మూడు కేటగిరీలను పేర్కొంటూ జాబితా ప్రకటించింది. దీనిపై విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వ్యక్తిగత బెదరింపులకు పాల్పడిన వారి విమాన ప్రయాణాలపై కనిష్ఠంగా రెండేళ్ల కాలం నిషేధం ఉంటుందని తెలిపింది.

లెవల్‌ 1 - దూషించడం, మద్యం తాగి అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యంగా సైగలు చేయడం లాంటి చర్యలకు పాల్పడితే మూడు నెలల వరకు నిషేధం విధిస్తారు.

లెవల్‌ 2 - సిబ్బందిని నెట్టడం, కొట్టడం, భౌతికంగా దాడి చేయడం, అసభ్యంగా తాకడం లాంటి చర్యలకు ఆరు నెలల వరకు నిషేధం ఉంటుంది.లెవల్‌ 3 - బెదిరించడం, విమాన వ్యవస్థను ధ్వంసం చేయడం లాంటి చర్యలకు పాల్పడిన ప్రయాణికులపై కనిష్ఠంగా రెండేళ్ల నిషేధం విధిస్తారు.

లెవల్‌ 3 - బెదిరించడం, విమాన వ్యవస్థను ధ్వంసం చేయడం లాంటి చర్యలకు పాల్పడిన ప్రయాణికులపై కనిష్ఠంగా రెండేళ్ల నిషేధం విధిస్తారు

ఇతరుల భయపెట్టడం, దాడిచేయడంతోపాటు విమానయాన సంస్థలకు నష్టం కలిగించే వారికి లెవెల్ 3 కింద తీవ్రమైన శిక్షలు ఉంటాయని పేర్కొంది. అలాగే సిబ్బందిని నెట్టడం, కొట్టడం, భౌతికంగా దాడి, మహిళలను అసభ్యంగా తాకడం లాంటి చర్యలకు లెవెల్ 2 కింద ఆరు మాసాలపాటు నిషేధం ఉంటుంది. దూషించడం, మద్యం సేవించి అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యంగా సైగలు చేయడం లాంటి చర్యలకు పాల్పడితే లెవెల్ 1 కింద మూడు నెలలు వరకు నిషేధం ఎదుర్కొంటారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యమని, దీన్ని దృష్ట్యిలో ఉంచుకునే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా పేర్కొన్నారు. అమెరికా లాంటి దేశాల్లో ఈ విధానం చాలా కాలం నుంచే అమల్లో ఉంది. నో ఫ్లై లిస్ట్‌పై పలువురు నిపుణులతో చర్చించిన విమానయాన శాఖ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.