గుజరాత్లో జరిగిన ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ పాల్గోన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆఫ్రికా దేశాలు, భారత్ మధ్య దశాబ్ధాల బంధం మరింత బలపడిందన్నారు. భారత విదేశీ విధానంలో ఆఫ్రికాకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు మెదీ తెలిపారు. ఆఫ్రికా ఖండం దేశాలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా సహకార ఒప్పందాన్ని తీర్చిదిద్దినట్లు ఆయన చెప్పారు. విద్య, టెక్నాలజీ రంగాల్లో ఆఫ్రికాతో భారత్కు ఉన్న అనుబంధాన్ని ప్రధాని కొనియాడారు. ఆఫ్రికా-భారత్ మధ్య వాణిజ్య బంధం గత అయిదేళ్లలో మరింత దృఢమైందన్నారు. గత మూడేళ్లలో భారత్ ఆర్థికంగా అత్యంత పురోగతి సాధించిందన్నారు. రైతులు, పేదలు, మహిళల సమస్యలను సవాళ్లుగా తీసుకున్నామన్నారు. రైల్వేలు, విద్యుత్తు, గ్యాస్ పైపులైన్లపై పెట్టుబడులు పెంచామన్నారు. వచ్చే ఏడాదిలోపు భారత్లో విద్యుత్తు లేని గ్రామం ఉండదని ప్రధాని మోదీ అన్నారు. వాతావరణ అనుకూల అభివృద్ధిలో భారత్ ముందుండాలన్నారు.