పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో తిరుగులేని విధంగా దూసుకెళుతున్న భారత జట్టుకు బ్రేక్ పడింది.. ఆస్ట్రేలియా పర్యటనను కోహ్లీ సేన ఓటమితో ఆరంభించింది. వర్ష ప్రభావిత మ్యాచ్‌లో 174 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ శిఖర్ ధవన్ ౭౬ , దినేశ్ కార్తీక్ (13 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 30) పోరాటం విజయం అంచుల వరకు తీసుకెళ్లింది.
చివరకు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆస్ట్రేలియా జట్టు 4 పరుగుల తేడాతో గెలిచి మూడు టీ20ల సిరీ్‌సలో 1-0 ఆధిక్యం సాధించింది. ఆసీస్ 16.1 ఓవర్ల సమయంలో భారీ వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. దీంతో కంగారూలు 4 వికెట్లకు 158 పరుగులు చేశారు.
మాక్స్వెల్ (24 బంతుల్లో 4 సిక్సర్లతో 46), క్రిస్ లిన్ (37), స్టొయినిస్ (33 నాటౌట్) చెలరేగారు. కుల్దీ్‌పకు రెండు వికెట్లు దక్కాయి. ఆసీస్ భారీ రన్‌రేట్‌తో ఉండడం, వికెట్లు తక్కువగా కోల్పోవడంతో భారత్‌కు 174 పరుగుల లక్ష్యాన్ని విధించారు. అయితే గట్టి పోటీనిస్తూ టీమిండియా చివరకు 17 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసి ఓడింది. ఆడమ్ జంపా, స్టొయిని్సలకు రెండేసి వికెట్లు దక్కాయి.