ప్రపంచ కప్ గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది భారత మహిళల జట్టు. చివరివరకు పోరాడినా ఓటమి తప్పలేదు. ఓపెనర్ రౌత్ (86), హర్మన్‌ప్రీత్ కౌర్ (51) రాణించినా, చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి చేజేతులా ఓడింది. ఓ దశలో సునాయాసంగా గెలుస్తుందనుకున్నా లోయర్ ఆర్డర్క కనీస ప్రతిఘటన చూపలేకపోయింది.229 రన్స్ టార్గెటట్తో బరిలోకి దిగిన భారత్ చివరికి 219 రన్స్‌కే ఆలౌటైంది.
ఇంగ్లండ్‌కిది నాలుగో ప్రపంచ కప్. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి వరకు ఉర్రూతలూగించిందీ మ్యాచ్. చివరికి కేవలం 9 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. చివరి 23 పరుగుల తేడాతో 6 వికెట్లుకోల్పోయింది మిథాలీ సేన. అంతకుముందు ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 228 రన్స్ చేసింది. ఆల్ రౌండ్ ప్రతిభతో భారత్‌ను 219కు ఆలౌట్ చేసి ఇంగ్లాండ్ నాలుగో ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆతిథ్య జట్టుగా మూడో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
దీంతో రెండోసారి ఫైనల్స్‌కు చేరినా భారత్ జట్టుకు టైటిల్ అందివ్వడంలో మిథాలీరాజ్, బౌలర్ గోస్వామి శ్రమ మరోసారి వృథా అయ్యింది. పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి 3 వికెట్లు తీసి.. ఇంగ్లండ్‌ను దెబ్బ తీసింది. ఓపెనర్లు విన్ఫీల్డ్ (24), బ్యూమాంట్ (23) తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే స్పిన్నర్లు రాజేశ్వరి, పూనమ్ యాదవ్ వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టేలర్ (45), సివర్ (51) నాలుగో వికెట్‌కు 83 పరుగులు జోడించారు.
పేస్ బౌలర్ ఝులన్ గోస్వామిని వీళ్ల భాగస్వామ్యానికి తెరదించడంతోపాటు ఒకే ఓవర్ రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. అటు స్పిన్నర్ పూనమ్ యాదవ్ 2 వికెట్లు తీయగా, రాజేశ్వరి ఒక వికెట్ తీసింది. బ్రంట్ (34) రనౌటైంది.
229 పరుగుల లక్ష్య చేధనలో భారత్ ఓపెనర్ స్మృతి మందాన డకౌట్ అయ్యి మరోసారి తీవ్ర నిరాశ మిగిల్చింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ ఒంటరి పోరాటం చేసి 86 పరుగుల చేసినా మిడిల్ ఆర్డర్లో బ్యాటర్స్ వీలైనన్ని పరుగుల చేయలేకపోవడంతో టైటిల్ వేటలో భారత్ రెండో సారి బోల్తా పడింది. ఈ క్రమంలో బరిలో దిగిన హర్మన్ ప్రీత్ కౌర్ రాకతో భారత స్కోర్ వేగం పెరిగింది. భారత్ 32 ఓవర్లలో 133 పరుగులను చేసింది. చివరి 18 ఓవర్లలో 5.33 రన్‌రేట్‌తో విజయానికి 106 పరుగులను చేయాల్సిన దశలో మూడో వికెట్‌కు పూనమ్, కౌర్ 95 పరుగులను జోడించారు.
హర్మన్ 80 బంతుల్లో అర్ధ సెంచరీ చేసింది. ఈ క్రమంలో 51 పరుగుల వద్ద 33.3 ఓవర్లో హార్లే బౌలింగ్‌లో డీప్ బ్యాక్వర్డ్ స్వేర్‌లో బీమాంట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. పూనమ్ రెండో సారి కూడా సెంచరీ మిస్ చేసుకుంది. జట్టు స్కోర్ 191 వద్ద పూనమ్ 86 పరుగుల వద్ద (115 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్) వద్ద నాలుగో వికెట్‌గా వెనుదిరిగింది.
మిడిల్ ఆర్డర్లో వేదా కృష్ణమూర్తి 35 పరుగుల (34బంతుల్లో 5 ఫోర్లు)తో అలరించింది. 36 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన దశలో గోస్వామి కూడా 13 పరుగుల వద్ద షర్బుసోల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యింది. దీంతో భారత్ 201 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.