ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత యువ జట్టు గెలుపు.న్యూజిలాండ్‌లోని మౌంట్ మాంగనీలో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన భారత్ ఫీల్డింగ్ చేసింది. అయితే భారత యువ బౌలర్లు విజృంభించటంతో ఆసీస్ జట్టు 47.2 ఓవర్లలో 216 పరుగులకే కుప్ప కూలింది.
ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ.. ఓపెనర్లు బ్రయంత్ (14), ఎడ్వర్ట్స్(28), ఆ తర్వాత వచ్చిన సారథి సంఘా (13) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు.చివరి ఐదు ఓవర్లలో భారత బౌలర్లు కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయటంతో ఆసీస్ జట్టు 47.2 ఓవర్లలో 216 పరుగులకు పరిమితమైంది.
అనంతరం 50 ఓవర్లలో 217 పరుగుల లక్ష్యంతో భారత జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఢిల్లీలోని అండర్ 19 ఆటగాడు ఫైనల్లో సెంచరీతో చెలరేగిన మన్జోత్ కర్లా ఇంటి ముందు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని సంబరాలు జరుపుకున్నారు. భారత కుర్రాళ్లు ఆసిస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు.
అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి భారత ఆటగాళ్లు వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్నారు. ఫేవరెట్‌గా టోర్నీలో అడుగుపెట్టిన టీమిండియా అందుకు తగ్గట్లే ఆడుతూ వచ్చింది. పెద్దగా పోరాడాల్సిన అవసరం లేకుండానే లీగ్, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్లో అలవోకగా గెలుపొందింది. ఈ గెలుపుతో అండర్-19 ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు(నాలుగుసార్లు) గెలుపొందిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండు వికెట్లు కోల్పోయి 38.5 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేధించింది.