శుక్రవారం దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో జరిగిన చివరి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లీ విజృంభించి 96 బంతులలో 129 పరుగులు నాటౌట్, చేయటంతో భారత్ 32.1 ఓవర్ల లోనే రెండు వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరు కుంది. అంతకముందు బ్యాటింగ్ చేసిన దక్షిణా ఫ్రికా జట్టు 8 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.
శార్దుల్ ఠాకూర్ చక్కటి బౌలింగ్ ప్రద ర్శన చేసి దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు చేయ కుండా అడ్డుకున్నాడు. 52 పరుగులు ఇచ్చి 4 వికెట్లను పడగొట్టి భారత్‌కు వెన్నుదన్నుగా నిలి చాడు. అయితే 205 విజయలక్ష్యంతో క్రీజులోకి దిగిన భారత్ జట్టు ప్రారంభంనుండే ధీటుగా బ్యాటింగ్ చేసింది. ధవన్18(34),రోహిత్ శర్మ 15(13) అవ్ఞట్ అయ్యారు.
భారత్ కోహ్లి-రహానేల ద్వయం 126 పరుగుల భారీ భాగస్వామ్యం మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చింది. రహానే 50 బంతులలో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలి చాడు. దీంతో 5-1 తేడాతో దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తొలి వండ్దే సీరిస్‌ను చేజిక్కించుకుంది. ఆఖరి మ్యాచ్ గెలవాలనుకున్న దక్షిణాఫ్రికా ఆశ లపై భారత బౌలర్లు నీళ్లు చల్లారు.
ఆరు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో మరో మ్యాచ్ మిగి లుండగానే గెలుచుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్‌లోనూ అదే పోరాటం కొనసాగిం చింది. మ్యాచ్ ఆరంభం నుంచే భారత బౌలర్లు సఫారీ జట్టును కట్టడి చేయడానికి ప్రాధాన్యత నిచ్చారు. ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శింకుండా నిలకడగా బౌలింగ్ చేసి వరుసగా వికెట్లను పడ గొట్టారు. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో దక్షిణా ఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
సిరీస్ ఆరంభం నుంచి నిల కడగా బౌలింగ్ చేస్తూ వచ్చిన బౌలర్లు ఈ మ్యాచ్ లోనూ అదే ప్రదర్శన కొనసాగించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు పిలిచిన సౌతాఫ్రికాను ఫాస్ట్ బౌలర్ శార్థూల్ ఠాకూర్ మొదటి నుంచే కట్టడి చేశాడు. నాలుగో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న శార్ధూల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ముందుగా ఓపెనర్ మర్క్రమ్ (30బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్సర్‌తో 24 పరు గులు), ఆమ్లా (19బంతుల్లో 10 పరుగులు)లను తొలి పది ఓవర్లకే పెవిలియన్‌కు పంపించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రమాదకర బ్యాట్స్ మెన్ డివిలియర్స్ (34 బంతుల్లో 4ఫోర్లతో 30 పరుగులు)ను కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవ నీయలేదు. శార్ధూల్‌కు తోడుగా బుమ్రా 2 వికెట్లు, చాహల్ 2 వికెట్లు జత కలవడంతో సఫారీ బ్యా ట్స్‌మెన్ వెంటవెంటనే పెవిలియన్‌ను అలంక రించారు. బుమ్రా 8 ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు.
ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా యువ ఆటగాడు జోండో 74బంతుల్లో 3ఫోర్లు, రెండు సిక్సర్లతో 54పరు గులు)ఒంటరి పోరాటం చేసే ప్రయత్నం చేశాడు. ఓపెనర్ మార్క్రమ్ ఔట్ అయిన అనంతరం 9ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగిన జోండో కేవలం చెత్త బంతులనే శిక్షిస్తూ అనవసర బంతులను ముట్టుకునే సాహసం చేయలేదు.
అయితే చాహల్ వేసిన 36 ఓవర్లలో భారత షాట్‌కు ప్రయత్నించి పాండ్యా చేతికి చిక్కడంతో జోండో పోరాటానికి తెరపడింది. 151 పరుగులకే ఏడు కీలక వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టుకు చివరలో ఆండిల్ ఫెలుక్వాయో (42బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లతో 34 పరుగులు), టెయిలెండర్ మోర్నీ మోర్కల్ (19బంతుల్లో 2సిక్సర్లతో 20పరుగులు) పోరాటం చేయడంతో 204 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు దక్కింది.
205 పరుగుల లక్ష్యంతో తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మూడో ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఐదో వన్డేలో సెంచరీతో మురిపించిన ఓపెనర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (13బంతుల్లో 3ఫోర్లతో 15 పరుగులు)లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఆఫ్ డ్రైవ్ షాట్ ఆడే క్రమంలో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఆతర్వాత కోహ్లీ-ధావన్‌లు నిలక డగా ఆడారు.
ఈ క్రమంలో 12.4ఓవర్ వద్ద జట్టు స్కోరు 80 పరుగుల వద్ద శిఖర్ ధావన్ (34బం తుల్లో 2ఫోర్లతో 18పరుగులు) లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఖాయాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆరో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేలలో తక్కువ మ్యాచ్ (208) లలో 100 క్యాచ్‌లు అందుకున్న క్రీడాకారుడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. బుమ్రా బౌలింగ్‌లో ఇమ్రాన్ తాహిర్ క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
కోహ్లీ కంటే ముందుగా 100 క్యాచ్‌లు అందుకున్న భారతీయ క్రీడాకారుల క్లబ్ లో సురేశ్‌రైనా (223మ్యాచ్‌లలో 100 క్యాచ్‌లు), అజరుద్దీన్ (231మ్యాచ్‌లలో 156 క్యాచ్‌లు), ద్ర విడ్ (283మ్యాచ్‌లలో 125క్యాచ్‌లు), టెండూ ల్కర్ (333 మ్యాచ్‌లలో 140క్యాచ్‌లు) ఉన్నారు.కెప్టెన్ కోహ్లీ లాగే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ మ్యాచ్‌లో మరో అరుదైన ఘనతను తన ఖాతాల్లో వేసుకు న్నాడు.
పరిమిత ఓవర్ల టోర్నీలో 600క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్ రికార్డు సృష్టించాడు.ధోని కంటే ముందు అంతర్జాతీయక్రికెట్లోదక్షిణాఫ్రికామాజీవికెట్కీపర్మార్క్(952క్యాచ్‌లు),గిల్‌క్రిస్ట్(813క్యాచ్‌లు)ముందున్నారు.