//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫైనల్లో భారత్..!

Category : sports

అండర్-19 ప్రపంచకప్ సెమీస్‌లో భారత భారీ విజయంతో ఫైనల్లోకి అడుగు పెట్టింది.ఫైనల్లో ఆస్ట్రేలియా తో ఆడనుంది. 203 పరుగుల తేడా తో పాకిస్తాన్ ఫై గెలిచింది. సెమీస్‌లో భారత బౌలర్లు విజృంభించి ఆడారు. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. శుభ్‌మాన్‌ గిల్ సెంచరీ(102)తో చెలరేగాడు. పృథ్వీ షా(41), మన్‌జ్యోత్‌ కల్రా(47), సుధాకర్‌ రాయ్‌(33) రాణించారు.

భారత పేసర్ ఇషాన్ పోరెల్ నిప్పులు చెరిగే బంతులకు పాక్ టాపార్డర్ కుప్పకూలింది. ఒకరి తర్వాత ఒకరుగా పాక్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరారు. రియాన్ పరాగ్ కూడా లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు విసురుతూ పాక్‌కు చుక్కలు చూపించాడు. పాక్ బ్యాట్స్‌మెన్‌లలో ముగ్గురు తప్ప మరెవరూ సింగిల్ డిజిట్ దాటలేదు.పాకిస్తాన్ 69 పరుగులకే కుప్పకూలింది.

ఆరు ఓవర్లు వేసిన ఇషాన్ పోరెల్ రెండు మెయిడెన్లు తీసుకుని 17 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మూడు ఓవర్లు వేసిన రియాన్ పరాగ్ ఓ మెయిడెన్ తీసుకుని 5 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. శివ సింగ్‌ 2 వికెట్లు తీసుకున్నాడు.