శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న రెండో టీ 20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వరూపం ప్రదర్శించాడు. 35 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ 20ల్లో వేగవంతంగా సెంచరీ సాధించిన రికార్డును సమం చేశాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ కూడా 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. తొలుత కుదురుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చిన రోహిత్.. ఆపై చెలరేగి ఆడాడు.
ఇక మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 8 ఓవర్లకు 88 పరుగుల వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (32), కేఎల్ రాహుల్ (28) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వరూపం ప్రదర్శించాడు. 35 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ 20ల్లో వేగవంతంగా సెంచరీ సాధించిన రికార్డును సమం చేశాడు.అంతకుముందు దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ కూడా 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. తొలుత కుదురుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చిన రోహిత్.. ఆపై చెలరేగి ఆడాడు.
ఇక టీమిండియా రథసారథి రోహిత్ శర్మ (118; 42 బంతుల్లో 12×4, 10×4) టీ20 చరిత్రలో వేగవంతమైన సెంచరీ బాదేశాడు. కేవలం 34 బంతుల్లోనే 101 పరుగులు చేసి డేవిడ్ మిల్లర్ రికార్డును సమం చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలు.10 సిక్సర్లు ఉండటం విశేషం.
శ్రీలంకతో రెండో టీ20లో ఓపెనర్‌గా దిగిన రోహిత్ తొలుత కాస్త నిలకడగా ఆడి తర్వాత వేగం పుంజుకున్నాడు. 23 బంతుల్లో అర్ధశతకం సాధించిన అతడు ఆ తర్వాత 11 బంతుల్లోనే మిగతా 50 పరుగులు చేసి శ్రీలంక బౌలింగ్‌ను వూచకోతకోశాడు. లంక సారథి పెరీరా వేసిన 11వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదేశాడు. ప్రతి సిక్సర్ కమనీయమే!రోహిత్‌కు ఇది టీ20ల్లో రెండో శతకం. చమీరా వేసిన 12.4వ బంతికి భారీ షాట్ ఆడబోయి అతను ఔటయ్యాడు. లేదంటే లంకేయులకు చక్కలు.చుక్కలే.
ఇక రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్ రోహిత్ శర్మ (118; 43 బంతుల్లో 12×4, 10×6) వేగవంతమైన శతకం బాదడంతో 14 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 177 పరుగులు చేసింది. చమీరా వేసిన 12.4వ బంతికి రోహిత్ ఔటయ్యాడు. దీంతో ధోనీ (11; 7 బంతుల్లో 2×4) క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ (47; 43 బంతుల్లో 3×4, 3×6) అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు.