ఐసిసి ఛాంపియన్స్ సమరంలో టీమిండియా నెంబర్ వన్ టీమ్ దక్షిణాఫ్రికాపై అలవోక విజయంతో సెమీస్ బెర్త్‌ను సాధించింది. ఆదివారం ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. దీనితో భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ సెమీఫైనల్ చేరాయి. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. రేపటి పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్ విజేతకు నాలుగో సెమీస్ బెర్త్ ఖాయం కానుంది.
టాస్ గెలిచిన విరాట్ దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత్ బౌలర్ల సమిష్టి రాణింపుతో ఫీల్డింగ్‌లో మెరుపులతో సఫారీలను 44.3 ఓవర్లలో 191 పరుగులకు కుప్ప కూల్చేశారు.192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన విరాట్‌సేన కేవలం 38 ఓవర్లలోనే అధిగమించి సునాయాస విజయాన్ని నమోదు చేసింది. ఉమేష్ యాదవ్ బదులుగా స్పిన్నర్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చాడు.
తొలి వికెట్‌తో అశ్విన్ బోణి చేయగా ఆ తర్వాత జడేజా, పాండ్య, బుమ్రా, భువనేశ్వర్‌లు తమ సత్తా చాటి సఫారీలను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయడంలో కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టారు. దీంతో భారత్ సగం విజయం అప్పుడే ఖరారైంది. ఓపెనర్ రోహిత్ శర్మ 12 పరుగుల వద్ద మార్క్వెల్ బౌలింగ్‌లో డి కాక్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. ఈ క్రమంలో విరాట్‌తో సమన్వయం చేసుకుని శిఖర్ ధావన్ కూల్‌గా పరుగులను రాబట్టారు. ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా సఫారీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. చెత్త బంతులను ఫీల్డర్ల మధ్య కొడుతూ ఫోర్లుతో స్కోర్ వేగాన్ని పెంచారు.
61 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్స్‌తో శిఖర్ రెండో అర్ధ సెంచరీని, . విరాట్ 71 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో ఈ టోర్నీలో రెండో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 24.4 ఓవర్లలో 128 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. శిఖర్ 78 పరుగుల వద్ద (83 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్) జట్టు స్కోర్ 151 వద్ద తహిర్ బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బరిలో దిగిన యువరాజ్ సింగ్ కెప్టెన్‌తో కలిసి 23 పరుగుల( 25 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్)తో అజేయంగా నిలిచాడు.
చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఆమ్లా, డి కాక్‌లు తొలి వికెట్‌కు మంచి శుభారంభాన్ని చ్చారు. వీరిద్దరు 17.3 ఓవర్లలో 76 పరుగులను సాధించారు. 35 పరుగుల వద్ద ఆమ్లా అశ్విన్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నిలకడగా ఆడుతూ 68 బంతుల్లో నాలుగు ఫోర్లతో అర్ధ సెంచరీ చేసిన డి కాక్‌ను 53 వద్ద జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో వికెట్‌కు డుప్లెసిస్, డి కాక్ 44 పరుగులతో ఫరవాలేదనపించారు.
ఫామ్‌లో లేని కెప్టెన్ డివిలియర్స్, డుప్లిసెస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దు తున్నట్లు కనిపించిన తరుణంలో 16 పరుగుల వద్ద సింగిల్ తీస్తూ పాండ్య విసిరిన బంతిని ఒడిసిపట్టు కుని ధోనీ అధ్భుతమైన రనౌట్ చేయడంతో డివిలియర్స్ పెవిలియన్ ముఖం పట్టాడు. కెప్టెన్ డివిలియర్స్ రనౌట్‌తో మ్యాచ్ భారత్ వైపు మలుపు తిరిగింది. తర్వాత వచ్చిన వారు వచ్చినట్లుగా అన్నట్లుగా భారత్ బౌలింగ్ ధాటికి పెవలియన్‌కు క్యూ కట్టారు. చివరి ఎనిమిది వికెట్లను సఫారీ జట్టు 58 పరుగులకే కోల్పోవడం విరాట్‌సేన బౌలింగ్, ఫీల్డింగ్ మెరుపులే కారణంగా చెప్పవచ్చు.