//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్ లో ఆందోళన కలిగిస్తున్న ఆకస్మిక హుద్రోగాలు

Category : national

కేంద్రమంత్రి అనిల్‌దవే (60), బాలీవుడ్ నటి రీమాలాగూ(59) హఠాత్తుగా గుండెపోట్లతో మరణించడం చాపకింద నీరులా దేశంలో వ్యాపిస్తున్న ఆకస్మిక గుండె జబ్బులను వెల్లడి చేస్తున్నది. ముందురోజు రాత్రి పొద్దుపోయే వరకు ప్రధానితో సమావేశాల్లో పాల్గొన్న దవే మరణిస్తారని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఆయనలో గుండెజబ్బు లక్షణాలేవీ కనిపించలేదు.

రీమాలాగూ సంగతీ అంతే. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు అంటున్నారు. భారతీయుల ఆయుర్దాయం క్రమంగా పెరుగుతున్నప్పటికీ హఠాత్తుగా గుండెపోట్లు వచ్చి చిన్నవయసులో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య కూడా పెరుగుతున్నదని వైద్య నిపుణులు అంటున్నారు.

పైగా హుద్రోగంతో చనిపోతున్న వారి సంఖ్య ప్రపంచంలో కెల్లా మనదేశంలోనే ఎక్కువగా ఉంటున్నది. ఒక అంచనా ప్రకారం ప్రతి 33 నిముషాల్లో ఒకరు మనదేశంలో గుండె జబ్బుతో చనిపోతున్నారు. సాలీనా 20 లక్షల మంది చనిపోతున్నారు. అయితే వీరిలో ఆకస్మికంగా హుద్రోగం సోకి ఎంతమంది చనిపోయారో సరైన వివరాలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహితం హుద్రోగ మరణాలల్లో భారత్ అగ్రగామిగా ఉన్నట్లు నిర్ధారించింది. 

మారుతున్న జీవన విధానాలు, ఆహారపు అలవాట్లే  ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీనిపై ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకుని అనుగుణంగా అలవాట్లు మార్చుకోవాలని సూచిస్తున్నారు. 

చాలాసార్లు గుండెజబ్బుల లక్షణాలు బయటికి కనిపించవు. కనిపించినా గుర్తుపట్టలేరు. ఏ ఎసిడిటీ లేక అజీర్తి అనుకుని నిర్లక్ష్యం చేస్తారని ఓ వైద్యుడు అన్నారు. భారత్‌లో గుండెపోట్లు వచ్చినవారి వయసు పశ్చిమ దేశాలతో పోలిస్తే 8-10 ఏండ్లు తక్కువగా ఉంటున్నది.