Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇదా ప్రపంచ అత్యుత్తమ జట్టు .......?

Category : sports

ప్రపంచంలోనే మేటి జట్టలలో ఒకటైన టీం ఇండియా ఇంగ్లాండ్ గడ్డపై ఘోరాతి ఘోరంగా విఫలం అవుతుంది. ప్రపంచ అత్యుతమ బ్యాటమెన్స్ టీమిండియా సొంతం. ఫార్మాట్ ఏదైనా ,ప్రత్యర్థి ఎవరైనా తన బాట్ తో ఊచకోత కోచే టీం ఇండియా కెప్టెన్ , పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ సారథ్యం.

కానీ ఇంగ్లాండ్ గడ్డపై వారి బౌలర్లు సంధించే బంతులని ఎలా ఆడాలో తెలియక పెవిలియన్ కి క్యూ కట్టారు. టీం ఇండియా టెస్ట్ స్పెషలిస్ట్ గా పలివబడే చటేశ్వర్ పుజారా ఆదుకుంటాడనుకుంటే అనవసర పరుగుకు కోసం రన్ అవుట్ గా వెనుదిరిగాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ నుండి పాఠాలు నేర్చుకొని రంగంలోకి దిగుతారనుకుంటే విదేశీ పిచ్ లపై మా ప్రదర్శన ఇంతే అనే విధంగా లార్డ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కొనసాగించారు.

కెప్టెన్ కోహ్లీ , రహానె పోరాడారు కానీ, ఇంగ్లాండ్ బౌలింగ్ ముందు వారుకూడా తలవంచక తప్పలేదు . అశ్విన్‌ పుణ్యమా అని స్కోరు వంద దాటింది. పదునైన తన బంతులతో ఆండర్సన్ టీం ఇండియాని ముచ్చెమటలు పట్టేలా చేసి , మూడుచెరువుల నీళ్లుతాగించాడు.

ఇంగ్లాండ్‌లో ఇంతకుముందు బాగా ఆడిన రికార్డున్న సీనియర్‌ ఓపెనర్‌ ఓపెనర్‌ మురళీ విజయ్‌.. ఈ పర్యటనలో మాత్రం ఘోర వైఫల్యాన్ని కొనసాగించాడు. ఇన్నింగ్స్‌ ఐదో బంతికే డకౌటై పెవిలియన్‌ చేరిపోయాడు. మొత్తం 35.2 ఓవర్లలో 107 పరుగులకే ఇండియా అల్ అవుట్ అయింది. దీనితో అందరిలోనూ అనుమానం మొదలయింది మరి కొద్దీ రోజుల్లో ఇంగ్లాండ్ లో ప్రపంచ కప్ జరగబోతుంది . ఇలా ఆడితే కనీసం సూపర్ సిక్స్ కూడా చేరే పరిస్థితి లేదని చర్చించుకుంటున్నారు. వీరి ప్రదర్శన చూస్తే ఇదేనా మన ప్రపంచ అత్యుతమ జట్టు అని అనుమానం రాక మానదు.