సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఉగ్రవాద బాధిత దేశమని పేర్కొన్నాడు. రియాధ్ లో ఆయన మాట్లాడుతూ ఇస్లామిస్ట్ ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు అరబ్ దేశాలన్నీ ఐక్యం కావాలని పిలుపు నిచ్చారు. ఏ దేశం కూడా తమ భూభాగంలో ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించకూడదని పరోక్షంగా పాకిస్థాన్ కి హెచ్చరికలు చేశారు.
దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ఆయా దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు. అమెరికా నుంచి భారత్ వరకు, ఆస్ట్రేలియా నుంచి రష్యా వరకు అన్ని దేశాలు ఉగ్రవాద బాధితులేనని, పలుసార్లు అనాగరిక ఉగ్రవాద దాడుల బారిన పడ్డాయని ట్రంప్ అన్నారు.