//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'మిస్‌ టీన్‌ యూనివర్స్‌-2017గా' భారత్ యువతి.

Category : world

మిస్‌ టీన్‌ యూనివర్స్‌-2017 గా భారత్ యువతి నిలిచింది.ప్రపంచ వ్యాప్తంగా అందగత్తెలందరినీ దాటుకొని మిస్‌ టీన్‌ యూనివర్స్‌-2017గా నోయిడా అమ్మాయి 'సృష్టి కౌర్‌' ఎంపికైంది. గత ఆరేళ్లుగా మిస్‌ యూనివర్స్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులే ఈ మిస్‌ టీన్‌ యూనివర్స్‌ పోటీలను నిర్వహిస్తున్నారు.ఈ మిస్‌ టీన్‌ యూనివర్స్‌ పోటీలలో 15నుంచి 19మధ్య వయసు గల యువతులు మాత్రమే పోటీకి అర్హులు.

లండన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌లో విద్యనంభ్యసించిన సృష్టి కౌర్‌ మనగ్వా రాజధాని నికరగ్వలోని రూబెన్‌ డారియో నేషనల్‌ థియేటర్‌లో నిర్వహించిన పోటీలో 25మంది ఫైనలిస్టులను వెనక్కినెట్టి కిరీటాన్ని దక్కించుకుంది. కెనడాకు చెందిన సమంత పిర్రే, మెక్సికోకు చెందిన అరి ట్రావ రన్నరప్‌లగా నిలిచారు.అంతేకాకుండా 'బెస్ట్‌ నేషనల్‌ కాస్ట్యూమ్‌' అవార్డును కూడా కౌర్‌ గెలుచుకుంది. భారత జాతీయ పక్షి నెమలి అలంకరణలో ప్రదర్శన ఇచ్చిన కౌర్‌ పలువురు చుపురలను ఆకట్టుకుంది.ఈ పోటీలకు లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ నుంచి అధిక సంఖ్యలో యువతులు పాల్గొన్నారు.