నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ఇస్ర్రో ఈనెల 5న ప్రవేశపెట్టనున్న మరో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహం వల్ల దక్షిణాసియా శాటిలైట్ (ఎస్ఏఎస్) పాకిస్థాన్ మినహా ఇతర సార్క్ సభ్య దేశాల కోసం కూడా ఉపయోగపడనుంది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం...దీని బరువు 2230 కిలోలు. మూడేండ్ల పాటు నిర్మించిన ఈ ఎస్ఏఎస్కు రూ.235 కోట్లు ఖర్చు అయిందట. ఇది పూర్తిగా సమాచార ఉపగ్రహం. ఇందులో రేడియో సంకేతాలను అందుకొనే 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్ పాండర్లు ఉంటాయి. ప్రతి దేశం కనీసం ఒక ట్రాన్స్ పాండర్తో అనుసంధానం కావచ్చు. ఈ ఉపగ్రహం అందించే సేవలన్నింటినీ మన పొరుగుదేశాలు పొందవచ్చు. టీవీ, డీటీహెచ్, టెలి మెడిసిన్, టెలి ఎడ్యుకేషన్ వంటి కార్యక్రమాలకు ఇది ఉపయోగపడుతుంది. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందించనుంది.