సొంత గడ్డ పై అదరగొడుతోన్న టీమిండియా ఈ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా బోర్డు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను వెల్లడించింది. డిసెంబరు 30న దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో కోహ్లీ సేన వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జనవరి 5న ఇరు జట్ల మధ్య కేప్‌టౌన్‌లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. డిసెంబరు 30న ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్ సుదీర్ఘకాలం పాటు సాగి ఫిబ్రవరి 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సేన ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.మరి సఫారీ పిచ్ లపై కోహ్లీ అండ్ కో ప్రదర్శన ఎలా ఉండబోతోందో తెలియాలంటే వేసి చుడాల్సిందే .
టెస్టు షెడ్యూలు
మొదటి టెస్టు: జనవరి 5 నుంచి 9 వరకు. వేదిక: కేప్‌టౌన్
రెండో టెస్టు: జనవరి 13 నుంచి 17 వరకు. వేదిక: సెంచూరియన్
మూడో టెస్టు: జనవరి 24 నుంచి 28 వరకు. వేదిక: జోహన్స్‌బర్గ్
వన్డే షెడ్యూలు
తొలి వన్డే: ఫిబ్రవరి 1, డర్బన్
రెండో వన్డే: ఫిబ్రవరి 4, సెంచూరియన్
మూడో వన్డే: ఫిబ్రవరి 7, కేప్‌టౌన్
నాలుగో వన్డే: ఫిబ్రవరి 10, జోహన్స్‌బర్గ్
ఐదో వన్డే: ఫిబ్రవరి 13, పోర్ట్ ఎలిజబెత్
ఆరో వన్డే: ఫిబ్రవరి 16, సెంచురియన్
టీ20 షెడ్యూల్
తొలి టీ20: ఫిబ్రవరి 18, జోహన్స్‌బర్గ్
రెండో టీ20: ఫిబ్రవరి 21, సెంచూరియన్
మూడో టీ20: ఫిబ్రవరి 24, కేప్‌టౌన్