అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ రోహిత్‌శర్మ సత్తా చాటారు. ర్యాంకింగ్స్‌లో కోహ్లి నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. రోహిత్‌శర్మ ఐదో ర్యాంక్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రోహిత్‌శర్మ 296 పరుగులు చేశాడు. ఈ సిరీస్ విజయంతో టీమిండియా నంబర్ ర్యాంక్ సైతం దక్కించుకుంది.