భారత మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాంపై నాసా శాస్త్రవేత్తలు తమకున్న గౌరవాన్ని సాటుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్సఎ్స)లో కనుగొన్న ఒక కొత్త జీవకణానికి అబ్దుల్ కలాం పేరు పెట్టి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఇంతకుముందు ఎప్పుడు భూమిపై కనిపించని ఈ జీవకణానికి (బ్యాక్టీరియా) ‘సొలిబసిల్లస్ కలామి’ అని పేరు పెట్టారు. భూమికి 400 కి.మీ. దూరంలో పరిభ్రమిస్తున్న ఐఎస్ఎస్ లోని ఫిల్టర్పై 40 నెలల కిందట గుర్తించిన ఈ బ్యాక్టీరియాపై సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ సారథ్యంలో పరిశోధనలు సాగించారు. గతంలో ఎప్పుడు ఇది భూమి కనిపించినప్పటికీ భూమికి వెలుపలి జీవరాశి కాదని, ఏదో సరుకుల ద్వారా ఐఎస్ఎస్ లోకి చేరి మనుగడ సాగిస్తున్నట్లు భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సమయంలో, 1963లో నాసాలో శిక్షణ పొందిన కలాం, ఆ తర్వాత భారతలో తొలి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని కేరళలోని తుంబ గ్రామంలో నెలకొల్పిన విషయాన్ని వెంకటేశ్వరన్ గుర్తు చేశారు.