హిందీ, గుజరాతీ తరువాత అమెరికాలో తెలుగు మాట్లాడేవారే అధికమని అమెరికా కమ్యూనిటీ సర్వే తెలియచేస్తుంది. ఐదు సంవత్సరాల వయసు పైన ఉన్న వారిలో హిందీ మాట్లాడేవారి సంఖ్య ఎనిమిది లక్షల వద్ద, గుజరాతీలు నాలుగు లక్షల మంది ఉండగా తెలుగు మాట్లాడేవారు దాదాపు మూడు లక్షల అరవైవేల మంది ఉన్నట్లు ఈ సర్వ్ తెలిపింది.తెలుగు, అమెరికాలో అన్ని రకాల భాషలు మాట్లాడేవారి సంఖ్యని పరిగణలోనికి తీసుకుంటే, 20 వ స్థానంలో ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది.