Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహేష్ సినిమా అయిన సరే రెమ్యునరేషన్ విషయంలో తగ్గనంటున్న విజయశాంతి

Category : movies

ప్రస్తుతం టాలీవుడ్ యువ దర్శకుల్లో మంచి ఊపు మీదున్న దర్శకుడు ఎవరయ్యా అంటే అందరూ అనిల్ రావిపూడి పేరే చెబుతారు, సంక్రాంతికి విడుదలైన F2 తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి. గతంలో చేసిన సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు తనకున్న క్రేజ్ ఎటువంటిదంటే 13 సంవత్సరాలుగా ఎంతో మంది దర్శకులు విజయశాంతిని నటింపచేయాలని ప్రయత్నాలు చేసినా కుదర లేదు, కానీ అనిల్ రావిపూడి రాస్తున్న ఒక కథలోని క్యారెక్టర్కి విజయశాంతి ఫిదా అయిపోయిన వెంటనే ఒప్పుకుంది. అనిల్ కూడా ప్ర‌త్యేకంగా త‌ను రాసుకున్న క‌థ‌కు విజ‌య‌శాంతి అయితేనే ప‌ర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫిక్సైపోయాడు. దాంతో ఆమె త‌ప్ప మ‌రో న‌టి ఈ పాత్ర‌కు ఛాయిస్ లేదు కాబ‌ట్టి అడిగినంత పారితోషికం కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారంట. ముందుగా ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి విజ‌య‌శాంతి కోటిన్న‌ర‌ అడిగింద‌ని తెలుస్తుంది..

చివ‌రికి కోటి పాతిక వ‌ర‌కు బేరం తెగ్గొట్టార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తున్న ర‌ష్మిక మంద‌న్న‌కు విజ‌య‌శాంతి కంటే త‌క్కువ‌.. అంటే కోటి వ‌ర‌కు ఇస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.కెరీర్లో 13 సంవత్సరాల గ్యాప్ వచ్చిన రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం టాప్ లో నే ఉంది విజయశాంతి. లేడీ సూపర్ స్టార్ కదా మరి రెమ్యునరేషన్ కూడా ఆరెంజ్ లో లేకపోతే ఎలా "సరిలేరు నీకెవ్వరు" అంటూ మహేష్ బాబు తో అనిల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నటించడం చాలా ఆనందం అని ఇటీవల విజయశాంతి చెప్పింది. తన సినిమా కెరీర్ ను సూపర్ స్టార్ కృష్ణ గారితో ప్రారంభించాను, అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్ ఆయన కుమారుడు మహేష్ బాబు గారి సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉందని ఇటీవల సినిమా ప్రారంభం రోజున మన సంతోషం తెలియజేశారు విజయశాంతి.