//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాత్రికి రాత్రే యూపీ సీఎం సంచలన నిర్ణయం

Category : national

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 140 మంది సివిల్‌ సర్వీసెస్‌ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. 84 మంది ఐఏఎస్‌, 54 మంది ఐపీఎస్‌ అధికారులను మరోచోటికి బదిలీ చేస్తూ ఆర్డర్స్ జారీచేశాడు. వీరిలో జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలరోజుల తరువాత ఇదే అతిపెద్ద పోలీస్‌ సంస్కరణగా నిలిచింది. ముఖ్యంగా మెయిన్పురి, నోయిడా, ఆగ్రా, సహారన్పూర్, అమ్రోహ, గోరఖ్పూర్, డియోరియా,కన్నౌజ్ జిల్లాల ఎస్ఎస్‌పీలను బదిలీ చేసింది. మునుపటి సమాజ్‌ వాదీ పార్టీ ప్రభుత్వం నియమించిన ఐపీఎస్‌ లలో ఎక్కువమందిని స్థానచలనం చేయడ విశేషం.