//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరికి మరణశిక్ష.. ఒకరికి జీవిత ఖైదు..!

Category : state

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషులకు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం శిక్షలు ప్రకటించింది. ఈ నెల 4న దోషులుగా ప్రకటించిన అనిక్ షఫిఖ్ సయ్యద్, మొహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు మరణ శిక్ష విధించింది.

ఐదో నిందితుడైన తారిఖ్ అంజుమ్‌ను ఇతర దోషులకు ఆశ్రయం కల్పించినందుకు కోర్టు సోమవారం దోషిగా ప్రకటించింది. ఇతనికి జీవిత ఖైదు విధించింది.2007 ఆగస్టు 25న లుంబినీ పార్క్‌, గోకుల్ చాట్‌లలో సంభవించిన ఈ పేలుళ్లలో 42 మంది చనిపోయారు. 300 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లు ఇండియన్‌ ముజాహిదీన్‌ సంస్థ పనేనని పోలీసులు లోగడ ప్రకటించారు.

ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ నెల 4న తీర్పు వెలువరించింది. మొదటి ముద్దాయి అనిక్ షఫిఖ్ సయ్యద్, రెండో ముద్దాయి మొహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను, ఇతర దోషులకు ఆశ్రయం కల్పించినందుకు ఐదో నిందితుడైన తారిఖ్ అంజుమ్‌ను దోషులుగా ప్రకటించింది.

Related News