Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపి లో మధ్యపాన నిషేదం పై అస్త్రాలు ఎక్కుపెట్టిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.... ఈ విషయం పై స్పందిస్తూ గవర్నర్ నరసింహన్.

Category : politics

ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో నూతన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక...... వై.ఎస్ జగన్ సీఎం గా పదవి బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ఇప్పటి వరకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.అందు లో భాగంగానే ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక వాగ్దానాలను...హామీలను ఒక్కొక్కటిగా నిర్వహించడంలో నిమగ్నం అవుతున్నారు.ఈ నేపథ్యంలోనే మద్యపాన నిషేధం అమలు చేస్తామని నవరత్నాల్లో భాగంగా ఏపి సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసేందుకు ఇప్పటికే అనేక చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యపానంపై నిషేధం విధిస్తామని, అది తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నో వేల కుటుంబాలను ఈ మద్యం మహమ్మారి ఛిన్నాభిన్నం చేస్తోందని, ఈ సమస్యను అధిగమించేందుకు దశల వారీగా మద్య పానం నిషేధిస్తామని ఆయన అన్నారు.

ముందుగా రాష్ట్రంలోని అన్ని బెల్టు షాపులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూడడం కోసం ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అవినీతి రహిత పాలనలో దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీని తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. అందుకే ఏపీలోకి సీబీఐని అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు. టెండర్ల ప్రక్షాళనకు జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు నరసింహన్ వెల్లడించారు. అవసరమైతే రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొస్తామన్నారు. టెండర్ల ప్రక్రియలో జరిగిన లోపాలను సరిదిద్దుతామని చెప్పారు.కాగా, ఇంతకుముందు సీఎం జగన్ కూడా మద్యపాన నిషేధం గురించి అధికారులతో ఇదే విషయమై చర్చించారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో అన్వేషించాలని అధికారుల్ని ముందు గానే సూచించారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. గొలుసు దుకాణాలపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.