//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సోనియా గాంధీకి అస్వస్థత

Category : national

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురుయ్యారు.

దీంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. నిర్మాణంలో ఉన్న తన సొంతిటిని పరిశీలించేందుకు సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా సిమ్లాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛరబ్రా వెళ్లారు. నిన్న అర్థరాత్రి సమయంలో సోనియా అస్వస్థతకు గురువడంతో ఆమె చండీగఢ్ వెళ్ళారు.

చండీగఢ్ లోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స చేయించుకునేందుకు ఆమె నిరాకరించారు. దీంతో ఆమె వెంట ఉన్న డాక్టర్‌ ఢిల్లీలోని ఇందిరాగాంధీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి ఫోన్‌ చేసి అంబులెన్స్‌ పంపమని కోరారు. అంబులెన్స్‌ వచ్చే లోపే సోనియా తన కారులో బయల్దేరారు.

కొంతదూరం వెళ్లాక వైద్యుల బృందం అంబులెన్స్‌లో వచ్చి అమెను డిల్లీకి తీసుకెళ్లారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సోనియా, ప్రియాంక చండీగఢ్ నుంచి శుక్రవారం ఉదయం 8.35 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ వెళ్ళారు.

Related News