//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ట్రెండ్ సెట్ చేస్తున్న ఇల్లీ బేబీ..!

Category : movies

Keerthi suresh, స‌మంత, పూజా హెగ్దే.. ఇలా హీరోయిన్లంద‌రూ ఇప్పుడు తెలుగులోనే మాట్లాడుతున్నారు. తెలుగులో త‌మ డ‌బ్బింగ్ తామే చెప్పుకుంటున్నారు. ఈ లిస్టులో ఇలియానా వ‌చ్చి చేరింది. 2006లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తెలుగులో డ‌బ్బింగ్ చెప్ప‌డానికి 12 ఏళ్లు ప‌ట్టింది. నెం.1 హీరోయిన్‌గా ఉన్న‌ప్పుడు కూడా తెలుగులో మాట్లాడ‌లేదు. కానీ, రీ ఎంట్రీలో ఆమె తెలుగులో మాట్లాడుతుంది.

దేవ‌దాసు, పోకిరి సినిమాల‌తో సెన్షేష‌న్ క్రియేట్ చేసి 2006 నుంచి 2012 వ‌ర‌కు నాన్ స్టాప్‌గా నెం.1 స్థానంలో కొన‌సాగింది ఇలియానా. ఆరేళ్ల‌పాటు అనేక సినిమాలు చేసినా ఆమె ఒక్క తెలుగు సినిమాలోనూ డ‌బ్బింగ్ చెప్పుకోలేదు. 2012లో తెలుగు సినిమాల్లో ఆమెకు ఇది రెండో ఇన్నింగ్స్‌. ఈ సినిమాలో త‌న డైలాగ్స్‌ను త‌నే చెప్పుకుంది. ఇలియానాను తెలుగులో మాట్లాడాల‌ని ద‌ర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల ఒప్పించాడ‌ట‌. కేవ‌లం నాలుగు రోజుల్లోనే ఆమె మొత్తం డైలాగ్స్‌ను చెప్పేసింద‌ట‌.

Keerthi suresh , స‌మంత‌, పూజా హెగ్దే.. ఇలా హీరోయిన్లంద‌రూ ఇప్పుడు తెలుగులోనే మాట్లాడుతున్నారు. అర‌వింద స‌మేత‌లో పూజా హెగ్దే త‌న మాట‌ల‌ను తానే మాట్లాడుకుంది. యూట‌ర్న్ సినిమాలో తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది. హీరోయిన్లు త‌మ క్యారెక్ట‌ర్‌కు తామే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండ్‌గా కొన‌సాగుతుంది.