//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సినీ ప్ర‌పంచం.. ప‌డ‌క‌గ‌ది ముచ్చ‌ట్లు.. సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన ఇలియానా..!

Category : movies

రంగుల ప్ర‌పంచంలో అందాల భామ‌ల జీవితాలు గురించి ఈ మ‌ధ్య చ‌ర్చ‌లు ఎక్కువ అయ్యాయి.

వెండితెర పై అందాల‌ను ఒల‌క‌బోసే హాట్ భామ‌లు తెర‌వెనుక వ్య‌వ‌హారాలు ఎలా ఉంటాయి.. సినీ ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు రావాలంటే అమ్మాయిలు త‌ప్ప‌కుండా ప‌డ‌క‌సుఖం అందించాల్సిందేనా.. ఇదే వ్య‌వ‌హారం పై తాజాగా ప్ర‌ముఖ హీరోయిన్ ఇలియానా కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది.

ఇలియానా మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య ఉంద‌ని అయితే ఈ విష‌యం పై ఏ ఒక్క‌రూ ఓపెన్‌గా మాట్లాడ‌ర‌ని.. అలా ఎందుకు మాట్లాడ‌రో కూడా చెప్పింది. ఇండ‌స్ట్రీలో వేధింపులకు గురైన వారు దాన్ని భయటపెడితే.. ఆ తర్వాత వారి కెరీర్‌ అక్కడితో ముగిసిపోతుందని చాలా మంది భ‌య‌ప‌డుతారు.

ఇక కొన్నాళ్ళ క్రితం ఓ జూనియర్ హీరోయిన్‌కు పెద్ద నిర్మాత‌ల నుండి వేధింపులు రావ‌డంతో.. ఆమె దీన్ని ఎలా ఎదుర్కోవాలో అని న‌న్ను సలహా అడిగింది. అయితే త‌న‌కు ఈ విష‌యంలో నేను స‌ల‌హా ఇవ్వ‌లేన‌ని చెప్పా ఎందుకంటే.. ఆమె స‌మ‌స్య గురించి ఆమెనే స్వ‌యంగా నిర్ణ‌యం తీసుకోవాలి.. ఆమె పై మరో వ్యక్తి ఒత్తిడి తగదని తాను భావించాన‌ని ఇలియానా చెప్పింది.

అంతే కాకుండా మ‌న దేశంలో సినిమా న‌టుల్ని పూజిస్తారని.. అయితే వారు తెర‌వెనుక ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారో.. ముఖ్యంగా హీరోయిన్లు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారో తెలియజేయడానికి చాలా మంది నటీనటులు ఏకమవ్వాల‌నిని ఇల్లిబేబి చెప్పుకొచ్చింది. దీంతో ఇలియానా వ్యాఖ్య‌లు మ‌రోసారి సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.