Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐకీయా వెనక ఉన్న అసలు నిజం ఇదే....

Category : business

ఐకేఈఏ(ఐకియా).. మొన్నటి వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు, ఇప్పుడు ఈ పేరు హైదరాబాద్ నగరంలో మార్మోగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్యసంస్థల్లో ఒకటైన ఐకియా.. హైదరాబాద్ నగరంలో తమ సంస్థను స్థాపించారు. హైద్రాబాదులో స్థాపించిన ఈ సంస్థ దేశంలోనే మొదటిది కావడంతో.. హైదరాబాదీల నోళ్లలో బాగా నానుతోంది. ఈ సందర్భంగా ఐకియా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

ఐకేఈఏ(ఐకియా)ను విస్తరిస్తే.. ఇంగ్వర్ కాంప్రాడ్ ఎల్మ్ టరిడ్ అగన్నరిడ్ అని పేరు వస్తుంది. ఇదేంటో తెలుసా... దీనిలోని మొదటి రెండు పదాలు.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఇంగ్వర్ ఫీడర్ కాంప్రాడ్‌ను సూచిస్తాయి. ఇక చివరి రెండు పదాలు ఆయన పుట్టిన ప్రాంతాన్ని చెబుతాయి. స్వీడన్‌కు చెందిన ఇంగ్వర్‌‌కు డిస్‌లెక్సియా అనే వ్యాధి ఉందని, దీనివల్ల ఆయనకు పేర్లు గుర్తుండవని సమాచారం. దీంతో ఆయన ఓ మార్గాన్ని ఎంచుకున్నారు. తనకు తెలిసిన ప్రాంతాల పేర్లను తన కంపెనీ ఉత్పత్తులకు పెట్టడం మొదలు పెట్టారు. ఉదాహరణకు.. బెడ్రూమ్ ఫర్నీచర్‌కు సంబంధించినవాటికి 'హెమ్నెస్' అని పేరు పెట్టారు. ఇది నార్త్ నార్వేలోని ఓ పట్టణం పేరు. అలాగే ఆఫీస్ ఫర్నీచర్‌కు 'లియాటోర్ప్' అని, స్టోరేజ్ ఫర్నీచర్‌కు 'కల్లాక్స్' అనే పేర్లను పెట్టాడు. ఈ రెండు కూడా స్వీడన్‌లోని ప్రాంతాల పేర్లు అంట. ఇలా ఆయన తన స్వీడన్, నార్వేలకు సంబంధించిన ఊళ్ల పేర్లను గుర్తుగా పెట్టుకున్నారు. ఇవి తేలికగా గుర్తుండడమే కాక.. వ్యాపారపరంగానూ ఆయనకు బాగా కలిసి వచ్చిందాని, ఇది ఓక బిజినెస్ టెక్నిక్ అంటున్నారు వ్యాపార నిపుణులు.


అలాగే పిల్లల వస్తువులకు సంబంధించి మంచి ప్రవర్తన, తెలివైన అని అర్థం వచ్చేలాగా 'డుక్టిగ్' అని పేరు పెట్టారు. ఇది పిల్లలకు స్ఫూర్తినిచ్చేది మాత్రమే కాక.. వారికి అతికినట్టు సరిపోతుంది. అలాగే ఆఫీస్ ఫర్నీచర్‌కు సంబంధించి 'ఎఫెక్టీవ్' అని, వంట గదిలో ఉండే ఫర్నీచర్ కోసం 'స్కార్ప్ట్' అనే పేరు పెట్టారు. వీటిలో ఎఫెక్టీవ్ అంటే ఆకర్షణీయమైన అని అర్ధం, 'స్కార్ప్ట్' పదునైన అని అర్ధం. ఇవన్నీ కూడా స్వీడీష్ భాషకు చెందిన పదాలని, తనకు గుర్తుండటానికి ఎలా పేర్లు పెట్టుకున్నారని చెబుతారు.

Related News