//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎక్కువ వసూలు చేస్తే శిక్షించాలి

Category : national

కొంత మంది వ్యాపారులు వినియోగదారుల నుంచి గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పి)కు తోడు జిఎస్టి పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీరి ఆగడాలకు చెక్‌పెట్టేందుకు జిఎస్టితో కలిపే ఎంఆర్‌పిని ముద్రించాలని జిఎస్టిపై ఏర్పాటైన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల స్థాయి కమిటీ సిఫారసు చేసింది. దీనిని అతిక్రమించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసోమ్‌ ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని కమిటీ కోరింది. వచ్చే నెల 10న గౌహతిలో జరిగే జిఎస్టి మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

రెస్టారెంట్లు, మాల్స్‌లో అమ్మే ప్యాకేజ్డ్‌ వస్తువులన్నిటికీ ఈ నిబంధన వర్తింపజేయాలని మంత్రుల కమిటీ సిఫారసు చేసింది. అయితే వ్యాపారులు, వ్యాపార సంస్థలు తమ రిటర్న్‌లు ఫైల్‌ చేసేటప్పుడు మాత్రం అమ్మకం ధరను, జిఎస్టిని వేర్వేరుగా చూపాలని కోరింది. ఇంకా రిటర్న్‌ల ఫైలింగ్‌ ఆలస్యమైతే ప్రస్తుతం రోజుకు రూ.100గా ఉన్న జరిమానాను రూ.50కి తగ్గించాలని సూచించింది. రిటర్న్‌ల ఫైలింగ్‌ విధానాన్ని మరింత సులభతరం చేయాలని కూడా కోరింది. రాష్ట్రాల పన్ను ఆదాయాలు వేర్వేరుగా ఉన్నందున జిఎస్టి అమలు విధానాన్ని వికేంద్రీకరించాలని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ కోరారు. అత్యంత ముఖ్యమైన జిఎస్టి పన్ను సంస్కరణని సరైన పద్ధతిలో అమలు చేసేందుకు కొంత సమయం పడుతుందన్నారు.