//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేవుడి పువ్వులతో పడక గదికి వెడితే జాగ్రత్త !

Category : national editorial

పువ్వలను దైవానికి సమర్పించి తిరిగి ప్రసాదంగా పొందడాన్ని భక్తులు శుభప్రదంగా భావిస్తుంటారు. అయితే దేవుడి దగ్గర పూలు తలలో పెట్టుకున్న తరువాత కొంతసేపటికి వాటిని తీసి పవిత్రమైన ప్రదేశాల్లో వదిలేయాలని, వివాహితులు ఆ పువ్వులను ధరించి ఎలాంటి పరిస్థితుల్లోను పడకగదిలోకి అడుగుపెట్టరాదని చెబుతారు. 

ఇందుకు సంబంధించిన కథ ఒకటి మనకి పురాణాల్లో కనిపిస్తుంది.పూర్వం దూర్వాస మహర్షి తపస్సుకి మెచ్చిన అమ్మవారు తన మెడలోని పూల హారాన్ని అతనికి బహుమానంగా ఇస్తుంది. ఆ పూలమాల వెదజల్లుతోన్న పరిమళానికి ముగ్ధుడైన దక్ష ప్రజాపతి, దానిని తనకి ఇవ్వవలసినదిగా దూర్వాసుడిని కోరాడు. 

అమ్మవారి ప్రసాదంగా తనకి లభించిన ఆ పూలమాలను అత్యంత పవిత్రంగా చూసుకోమంటూ ఆయన ఆ మాలను దక్షప్రజాపతికి ఇచ్చాడు. ఆ రాత్రి దక్షప్రజాపతి ఆ పూలమాలను తన పడక గదిలోని మంచానికి అలంకరించాడు.

ఆ విధంగా చేసిన దోషమే ఆయన్ని శివ ద్వేషిగా మార్చింది. శివుడి కారణంగానే శిరస్సును కోల్పోవలసి వచ్చింది. కనుక దైవానికి భక్తితో సమర్పించిన పువ్వులు తిరిగి ప్రసాదంగా స్వీకరించినప్పుడు, వాటిని పవిత్రంగా చూసుకోవాలి .. పవిత్రమైన ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలని శాస్త్రం చెబుతోంది.