Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అక్కడ ఏ పార్టీ గెలిస్తే అధికారం ఆ పార్టీదే... జోరుగా చర్చ

Category : state politics

ఏపీ రాజకీయాల్లో గోదావరి జిల్లాలకు ప్రత్యేక స్థానం వుందని చెప్పుకోవాలి. వారు డిసైడ్ చేసిన పార్టీయే అధికారంలోకి వస్తుందనేది గతచరిత్ర చెబుతోంది. 2014 ఎన్నికల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్విప్ చేసింది. అన్ని సీట్లు టీడీపీకే (టీడీపీ - బీజేపీ కలిపి పొత్తు) కట్టబెట్టారు ఆ జిల్లా వాసులు. ఈ క్రమంలో ఏలూరు నియోజకవర్గంలో ఏ జెండా ఎగిరితే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని అంతా భావిస్తున్నారు.

1989 నుంచి ఏలూరులో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ నే అధికారం చేజిక్కించుకుంది. ఇలా ఒకసారి కాదు..రెండుసార్లు కాదు ఏకంగా 1989-2014 వరకూ ఇదే సంప్రదాయం కొనసాగింది. ఈ క్రమంలో ఏలూరు నియోజకవర్గంపై ఆయా పార్టీలు ప్రత్యేక దృష్టిని పెడతాయనే విశ్లేషకులు చెబుతుంటారు. ప్రస్తుతం ఏలూరు నియోజకవర్గం నుంచి బడేటి కోట రామారావు (బుజ్జి) టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న కోట రామారావుకే ఈసారి కూడా టీడీపీ టికెట్‌ను ఖరారు చేసింది. 2019 ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని బుజ్జి పట్టుదలతో ఉండగా.. ఏలూరు కార్పొరేషన్‌ కోఆప్షన్‌ మెంబరు షేక్‌ ముజుబర్‌ రెహ్మాన్‌ (పెదబాబు) కొత్తగా రంగంలోకి దిగాలని ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇకపోతే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడు, ఆళ్ళ కాశీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని) పోటీలో ఉంగా..జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు బరిలో ఉన్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ కొత్తగా ఎన్నికల బరిలో నిలబడగా..

టీడీపీ, వైసీపీ పార్టీల ఓట్లకు జనసేన గండి కొడుతుందనే గుబులు రెండు పార్టీల్లోను ఉంది. మరి ఈసారి ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గ ప్రజలు ఏపార్టీకి అధికారాన్ని కట్టబెడతారో వేచి చూడాలి.

Related News