//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Category : national

జియో టెలికాం రంగంలోకి అడుగు పెట్టాక ఇతర టెలికాం సంస్థలు వెనకబడ్డాయి అనే చెప్పాలి.జియో వచ్చినప్పటినుంచి కొత్త ఆఫర్స్ తో ఇతర కంపెనీ వాళ్లకి కంటిమీద కునుకు లేదనే చెప్పాలి.ఇతర టెలికాం సంస్థల్ని జియో ని ఎదుర్కొనేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.ఎయిర్టెల్ సరికొత్త ఆఫర్స్ తో వస్తున్నట్టే,ఐడియా కూడా కొత్త ఆఫర్స్ తో మార్కెట్ లోకి వచ్చేసింది వివరాలలోకి వెళ్తే,

ఐడియా సెల్యులర్ తన రూ.389 ప్లాన్‌ను సవరించింది. రిలయన్స్ జియోను ఎదుర్కొనేందుకు ‘నిర్వాణ పోస్టు పెయిడ్ ప్లాన్’లో భాగంగా అందిస్తున్న మొత్తం 8 రీచార్జ్ ప్యాక్‌‌లలో అదనంగా మరింత డేటాను అందిస్తున్నట్టు తెలిపింది. రూ.499, రూ.649, రూ.999 ప్లాన్‌‌లను ఇది వరకే సవరించిన ఐడియా ఇప్పుడు మొత్తం ప్లాన్లను సవరించింది. ఇప్పుడు రూ.389, రూ.1,299, రూ.1,699, రూ.1,999, రూ.2,999 ప్లాన్లను తాజాగా సవరించింది. గతంలో రూ.

389 ప్లాన్ కింద అపరిమిత లోకల్/ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు నెలకు రూ.20 జీబీ డేటా అందించగా ఇప్పుడు దానిని 20 జీబీకి పెంచింది. రూ.1299 ప్లాన్‌లో గతంలో 85 జీబీ అందించగా ఇప్పుడు దానిని 100 జీబీకి పెంచింది. అలాగే రూ.1,6999 ప్లాన్‌లో 150 జీబీ, రూ.1,999 ప్లాన్‌లో 200 జీబీ, రూ.2,999 ప్లాన్‌లో 300 జీబీ అందిస్తున్నట్టు పేర్కొంది.