Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐసీఐసీఐ బ్యాంకు మహిళాలోకానికి స్పెషల్ సేవింగ్స్ అకౌంట్ ... బోలెడన్ని బెనిఫిట్స్

Category : business

ఐసీఐసీఐ బ్యాంకు మహిళల కోసం ప్రత్యేకమైన సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించింది. దేశీ దిగ్గజ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగాలు చేస్తున్న వారి కోసం ‘ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఆరా సేవింగ్స్ అకౌంట్‌’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అకౌంట్ ప్రారంభించిన వారు షాపర్స్‌స్టాప్ గిఫ్ట్ కార్డ్ పొందొచ్చు. తనిష్క్, ఓలా నుంచి వోచర్లు కూడా అందుతాయి. అలాగే బిగ్ బాస్కెట్, లాకర్ రెంటల్స్ కొనుగోళ్లలో డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వినియోగంపై క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఆరా సేవింగ్స్ అకౌంట్‌ ప్రత్యేకతలు..

ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వినియోగం వల్ల రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అన్ని బ్యాంకుల ఏటీఎంలలోనూ ఎన్ని సార్లైనా కార్డు ఉపయోగించొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌లలో లాకర్ రెంటల్స్‌పై 50 శాతం తగ్గింపు పొందొచ్చు. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో డిస్కౌంట్ లభిస్తుంది. వడ్డీ రేట్లు వారికి ప్రత్యేకంగా ఉంటాయి. హోమ్ లోన్, హోమ్ లోన్ టాప్-అప్ తీసుకున్నవారికి ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం మినహాయింపు ఉంటుంది.హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. టూవీలర్ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజులో రూ.499 తగ్గింపు, వాహనానికి 100 శాతం ఆన్-రోడ్ ప్రైస్ రుణంగా పొందొచ్చు.

షాపర్స్‌స్టాప్ నుంచి రూ.2,000 గిఫ్ట్ వోచర్ పొందొచ్చు . మూడు నెలలకు ఒకసారి ఎయిర్‌పోర్ట్ లాంజ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా లభిస్తుంది. రూ.250 విలువైన ఓలా వోచర్, బిగ్‌బాస్కెట్‌లో నెలకు ఒకసారి రూ.1,000 కొనుగోలుపై రూ.250 డిస్కౌంట్ లభిస్తుంది. సిప్, పీపీఎఫ్ ఆటో డెబిట్ కలిగి ఉంటే తనిష్క్ నుంచి రూ.1,500 విలువైన వోచర్ కూడా లభిస్తుంది. డిమాండ్ డ్రాఫ్ట్, పే ఆర్డర్ రూపంలో రోజుకు రూ.2 లక్షల వరకు చెల్లింపులపై చార్జీల మినహాయింపు వర్తిస్తుంది.ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్, తొలి ఏడాది డీమాట్ ఏఎంసీ ఫీజులు ఉండవు.

Related News