//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరోసారి నిరాశ పరిచిన మహిళల టీం ......సెమీస్ లో ఘోర పరాజయం ..!

Category : sports

మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భారత్ పరాజయం పాలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభమే ఇచ్చారు. స్మృతి మంధాన-తానియా భాటియా తొలి వికెట్‌కు 43 పరుగులు జోడించారు.

అయితే, ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్‌ నైట్‌ విడగొట్టింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా ఆకట్టుకోలేకపోయింది. చివర్లో టెయిలెండర్లు సైతం చేతులెత్తేయడంతో భారత్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌట్ అయింది.

కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే రాధా యాదవ్ దెబ్బకొట్టింది. ఒక పరుగు మాత్రమే చేసిన బ్యూమౌంట్ మిడాన్‌లో ఉన్న అరుందతీ రెడ్డి చేతికి చిక్కింది. తర్వాత డానీ వ్యాట్ కూడా ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుటయింది. దీంతో భారత్‌ శిబిరంలో ఆశలు రేకెత్తాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నాటాలీ స్కివర్-అమీ అలెన్ జోన్స్ జోడీ మరో వికెట్ పడకుండా ఇంగ్లండ్‌ను విజయ తీరాలకు చేర్చింది.