//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐబీఎంలో ఉద్యోగుల తొలగింపు.

Category : national

ఐటీ రంగ ఉద్యోగులను కుదిపేస్తున్న తొలగింపు అంశం ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటివరకు కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ టెక్ మహీంద్రా వంటి సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించగా ఇప్పుడు ఈ జాబితాలో మరో అంతర్జాతీయ దిగ్గజం ఐబీఎం చేరనుంది. ఐబీఎంకు చెందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే కొన్ని మాసాల్లో సుమారు 5000 మంది ఉద్యోగులను ఐబీఎం తొలగించనుంది.

ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో ప్రాథమిక విభాగం అయిన మధింపు ప్రక్రియ ఐబీఎంలో ఇప్పటికే ప్రారంభం అయిందని ఐబీఎంలోని విశ్వసనీయవర్గాలు అంటున్నాయి. సరైన పనితీరు లేని ఉద్యోగులను గుర్తించాలని ఇప్పటికే మేనేజర్లకు సూచనలు అందాయి అని ఐబీఎంలోని సీనియర్ వర్గాలు అంటున్నాయి. మా సంస్థలోని ఉద్యోగులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం వారిని క్రమబద్దీకరించడం అనేవి నిరంతరం జరిగే ప్రక్రియని సదరు వర్గాలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు క్లౌడ్ టెక్నాలజీ ఉపయోగించడం కూడా ఇందులో ఒక భాగమని పేర్కొన్నారు.