//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ చెప్పిన విషయాన్నే నేను అడుగుతున్నాను...!

Category : politics

రాష్ట్రము లో జరుగుతున్న రాజకీయాల ఫై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అసెంబ్లీ లో మాట్లాడాడు.మొదటగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి, తరువాత మా రాష్ట్రము లో వున్న సమస్యలను , కేంద్రం నుండి ఇంకా ఎంతమేర మనకు నిధులు రావాలి అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆ రోజు హేతుబద్ధత లేకుండా విభజించారని, దీనివల్లే ఇరు రాష్ట్రాల మధ్య రూ. 38వేల కోట్ల మేర తలసరి ఆదాయంలో తేడా వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని అభ్యర్థిగా మాట్లాడుతూ, తాను ప్రధానిగా ఉంటే రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేసేవాడినని చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

జాతీయ కాంగ్రెస్ పార్టీ బిడ్డను బతికించి, తల్లిని చంపేసిందంటూ విమర్శించారని చెప్పారు. తానైతే తల్లి, బిడ్డ ఇద్దర్నీ బతికించేవాడినని చెప్పారని అయన అన్నారు . తాను ప్రస్తుతం ఆ విషయాన్నే అడుగుతున్నానని ఇద్దరికీ న్యాయం చేస్తానని చెప్పిన మీరు, విభజన చట్టంలో ఉన్నవాటిని ఎందుకు నెరవేర్చడం లేదని మోదీని ఉద్దేశించి ప్రశ్నించారు.

నేను 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా సరైన ప్రతిఫలం దక్కలేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు విమర్శలు గుప్పించారు. విభజన చట్టంలోని లోపాలను ఎందుకు సరిదిద్దడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇంకా సంయమనం పాటిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.