సోమవారం ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన గౌతమ్ గంబీర్, ఇప్పుడు మరోసారి తన దేశ భక్తిని చాటుకున్నాడు. అమరులైన జవాన్ల పిల్లలకు సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు. వీరి చదువుకు అవసరమైన పూర్తి ఖర్చును తాను భరించనున్నట్లు ప్రకటించాడు. దీని సంబంధిన విషయాలన్ని గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ చూసుకుంటుందని తెలిపాడు.జవాన్ల వూచకోత, పత్రికల్లో వచ్చిన వారి కుమార్తెల చిత్రాలు తనను కలచివేశాయని గంభీర్ చెప్పాడు. అంతకు ముందు ఛత్తీస్గఢ్ ఘటన గురించి స్పందించిన గౌతమ్ .. ‘‘ఛత్తీస్ఘడ్, కాశ్మీర్, ఈశాన్యం.. మనకు ఇంకా డేంజర్ బెల్స్ అవసరమా....లేక మన చెవులు వినిపించకుండా ఉన్నామా? నా దేశ ప్రజల ప్రాణాలు విలువలేనివి కావు.. అంతకంతకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందే...’’ అని గంభీర్ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.