//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా..!

Category : national

కోటానుకోట్లు బ్యాంకుల నుండి, ప్రజల నుండి దర్జాగా దోచుకుంటున్న వారిని ఏమి చేయలేని ఈ సమాజం ఓ చిన్న దొంగతనం చేశాడన్న నెపంతో, మానసిక స్థితి సరిగా లేని ఓ యువకుడిని కొట్టి చంపిన ఘటన కేరళలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దారుణంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెళ్లుబుకుతోంది. దుండగులు తన సోదరుడిని చంపేశారంటూ ప్రముఖ నటుడు మమ్ముట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

భారత జట్టు ఆటగాడు క్రికెట్ ప్రపంచంలో తన ప్రతిభను చాటుకున్న మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ దారుణం పై ఆవేదన వ్యక్తం చేశాడు. 'మధు ఒక కేజీ బియ్యాన్ని దొంగిలించాడు. ఈ మాత్రం దానికి ఉబైద్, హుస్సేన్, అబ్దుల్ కరీమ్ ల గుంపు ఆ పేద గిరిజనుడిని చంపేసింది. అభివృద్ధి చెందిన సమాజానికి ఇదొక మచ్చ. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా' అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.