ఆఫ్ఘన్ యువ సంచలనం ముజీబ్ రహమాన్ టీం ఇండియాతో తాము ఆడబోయే చారిత్రాత్మక టెస్ట్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసాడు. తాను అశ్విన్ దగ్గర నేర్చుకున్న వ్యూహాలనే టీం ఇండియాపై ప్రయోగిస్తానని చెప్పాడు. తాజాగా మాట్లాడిన అతను.. ‘‘ఐపీఎల్లో అశ్విన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని అద్భుతమైన సలహాలు ఇచ్చాడు. ఎక్కడ బౌలింగ్ చేయాలో కొన్ని ప్రదేశాలు చూపించాడు. అంతేకాక.. నాకు విచిత్రంగా బంతిని విసరడం నేర్పించాడు. అది ఆఫ్ స్పిన్ యాక్షన్తో వేసే క్యారమ్ బాల్’’ అని పేర్కొన్నాడు. అలాగే తాను గతంలో హైలెవల్ క్రికెట్ ఆడానని ఇప్పుడు అదే తనకు ఉపయోగ పడుతుందని తాను అసలు టెస్ట్ మ్యాచ్ గురించి భయపడట్లేదని చెప్పాడు, కాగా ముజీబ్ ఐపియల్ లో పంజాబ్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.