//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐపీల్ విజేత ఎవరో తెలిసిపోయింది...!

Category : sports

ఐపీల్ క్రికెట్ సమరం మొదలు కాబోతుంది. దీనితో అభిమానుల్లో ఈ క్రికెట్ టోర్నీ ఆశక్తిని పెంచేస్తుంది. రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తిరిగి రావడంతో ఐపియల్ 11కి పూర్వ శోభసంతరించుకుంది. ఇది ఇలా ఉంటె ఒక జ్యోతిష్కుడు ఐపియల్ లో గెలిచే జట్టు ఎవరో చెప్పేసాడు.

ప్రముఖ జ్యోతిష్కుడు, విశ్లేషకుడు గ్రీన్‌స్టోన్ లోబో జోస్యం చెప్పాడు. 1981లో పుట్టిన కెప్టెన్లు గౌతం గంభీర్, ఎంఎస్ ధోనిలు మరోసారి ట్రోఫీ నెగ్గే అవకాశం లేదన్నాడు.

అంటే ఢిల్లీ డేర్‌డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు నెగ్గవని చెప్పినట్లు. అనుభవం ఉన్న కెప్టెన్లను ఈ సీజన్లో దూరం చేసుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు ట్రోఫీ నెగ్గేలా కనిపించడం లేదు. గ్రీన్‌స్టోన్ లెక్క ప్రకారం ఐపీఎల్ 11 రేసులో ఇక మిగిలిన నాలుగు జట్లు.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌. ఈ నాలుగు జట్ల పోటీ ఎక్కువగా ఉన్నా ఇందులో రెండు జట్లను మాత్రం అదృష్టం వరిస్తుందన్నాడు.

రోహిత్ శర్మ నేతృత్వంలో వరుసగా రెండోసారి ముంబై ట్రోఫీ నెగ్గదని, గంభీర్ స్థానంలో కోల్‌కతా కెప్టెన్‌గా వచ్చిన దినేశ్ కార్తీక్ వీక్ కెప్టెన్‌గా కనిపించడం దెబ్బతీస్తుందన్నాడు. ఇక పోటిలో మిగిలిన పంజాబ్‌, బెంగళూరు జట్లు.

జ్యోతిష్యం ప్రకారం చూసినా, అనుభవం పరంగా, ఆటపట్ల అంకిత భావం చూసినా విరాట్‌ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌కు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. వీరి ఆటకు గ్రహబలం తోడవుతుందని.. దీంతో బెంగళూరు లేక పంజాబ్ జట్లలో ఓ జట్లు ఐపీఎల్ 11వ సీజన్‌ను కైవసం చేసుకుంటుందని చెప్పాడు.

Related News