//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేను తలుచుకుంటే మోడీ ముఖ్యమంత్రి కూడా అయ్యే వారు కాదు

Category : national state politics

తాను పదవులు ఆశించి ఉంటె మోడీ ముఖ్యమంత్రి కూడా అయి ఉండే వారు కాదని విశ్వ హిందు పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. తొగాడియా నామినేట్ చేసిన రాఘవ్ రెడ్డి సంస్థాగత ఎన్నికల్లో ఓటమి చవిచూడటంతో కినుక వహించిన ఆయన శనివారంనాడు వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి అమలు తదితర డిమాండ్లపై ప్రవీణ్ తొగాడియా పల్డిలోని వీహెచ్‌పీ కార్యాలయం ముందు మంగళవారంనాడు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేసారు. మోదీతో తనకెలాంటి వివాదాలు లేవని, కేవలం రామాలయం నిర్మాణానికి సంబంధించి చట్టం చేసే విషయంలో మోదీ మౌనం ఒక్కటే ఆయనతో తనకున్న సమస్యని ప్రవీణ్ తొగాడియా అన్నారు. తాను ఎలాంటి పదవులు కోరుకోకుండానే నాలుగు దశాబ్దాల పాటు సంఘ్ పరివార్‌కు సేవలందించానని, తానే కోరుకుని ఉంటే 2001లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడినని అన్నారు. 'మోదీతో నాకు వివాదాలే ఉండుంటే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యిండేవారు కాదని విమర్శించారు. తను రామ మందిర నిర్మాణమే అడిగాను గాని ఏ సీటు అడగలేదని స్పష్టం చేసారు.