//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేను విజయ్ దేవరకొండ అభిమానిని : కైరా అద్వాని

Category : movies

ఎమ్.ఎస్.ధోని సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై, మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచుకున్న కైరా అద్వాని. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ఆమె కథానాయకగా చేసిన సినిమా 'వినయ విధేయ రామ'. ఈ సినిమా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వుంది. అయితే కైరా అద్వానీ 'అర్జున్ రెడ్డి' పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఒక ఇంటర్వ్యూ లో కైరా అద్వానీ మాట్లాడుతూ. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. 'వినయ విధేయ రామ' లో నటనతో పాటు డ్యాన్స్ కి అవకాశం ఉన్న పాత్రా రావటం తన అదృష్టం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్' సినిమాలో నటిస్తున్నట్టు చెప్పింది.

కబీర్ సింగ్ సినిమా కోసం ఆమె 'అర్జున్ రెడ్డి' సినిమా చూసినట్టు ఆ సమయంలోనే 'విజయ్ దేవరకొండ'కు పెద్ద ఫ్యాన్ అయ్యింది అని చెప్పింది. మహేష్ ,రామ్ చరణ్ ల తో సినిమాలు తియ్యడం వలన వాళ్ళ ఫ్యామిలీస్ తో మంచి పరిచయం ఏర్పడింది అని. హైదరాబాద్ లో షూటింగ్ ఉంటె వాళ్ళ ఇంటి బోజనమే చేస్తాను అని చెప్పుకొచ్చింది.