ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్, తాజాగా సరికొత్త మోడల్స్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 'ఇ ప్లస్', ఎస్ఎక్స్ ప్లస్ డ్యూయల్ టోన్ , ఎలైట్ ఐ20ని అనే మూడు రకాల డీజిల్ , పెట్రోల్ నడిచే వాహనాలను విడుదల చేసింది..1.40 లీటర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన ఎగ్జిక్యూటివ్ రకం 'ఇ ప్లస్' ధరను రూ.9.99 లక్షలుగా , 1.60 లీటర్ల సామర్థ్యం గల ఎస్ఎక్స్ ప్లస్ డ్యూయల్ టోన్ పెట్రోలు రకం ధరను రూ.12.35 లక్షలు, డీజిల్ రకం ధరను రూ.13.88 లక్షలు (ఎక్స్‌షోరూం, దిల్లీ)గా నిర్ణయించినట్లు తెలిపింది.మరియు ఎలైట్ ఐ20 మోడల్ కారు పెట్రోల్,డీజిల్ రకాల్లో లభిస్తుంది.పెట్రోలు రకం ధర రూ.5.36-90.09 లక్షలు, డీజిల్ రకం ధర రూ.6.66-8.51 లక్షలుగా నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది. కారులో ప్రయాణించే వారి భద్రత కోసం ఆరు ఎయిర్ బ్యాగులు, బ్రేకులు వేసినప్పుడు జారిపోకుండా ఏబీఎస్ సాంకేతికత, ఐఫోన్ అనుసంధానం కోసం యాపిల్ కార్ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి అని సంస్థ తెలిపారు.ఈ మోడల్స్ కు ప్రపంచవ్యాప్తంగానూ మంచి స్పందన లభిస్తోందని చెప్పారు.