//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ల‌గ‌డ‌పాటి ప్రాణ స్నేహితుడి అరెస్టుకు రంగం సిద్ధం..!

Category : politics

హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల బంజారాహిల్స్‌లో అర్థ‌రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. రోడ్‌.నెం.65లో ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త జీపీ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల విష‌యం తెలుసుకున్న జీపీరెడ్డి మిత్రుడు, మాజీ ఎంపీ Lagadapati Rajagopal అక్క‌డ‌కు చేరుకున్నారు. జీపీ రెడ్డి ఇంట్లో సోదాలు చేసేందుకు వ‌చ్చిన పోలీసుల‌ను ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అడ్డుకున్నారు. అయితే, రాత్రి నుంచి సోదాల‌ను కొన‌సాగిస్తున్న పోలీసులు ఏ క్ష‌ణానైనా జీపీరెడ్డిని అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

GP Reddy ఇంట్లో పోలీసుల సోదాల‌కు సంబంధించి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి అనుమ‌తులు, వారెంట్ లేకుండానే త‌న మిత్రుడు జీపీ రెడ్డి ఇంట్లో అర్థ‌రాత్రిళ్లు సోదాలు ఎలా నిర్వ‌హిస్తారంటూ పోలీసు ఉన్న‌తాధికారుల‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. వ‌రంగ‌ల్‌కు చెందిన ఐజీ నాగిరెడ్డి, జీపీ రెడ్డికి మ‌ధ్య భూమి విష‌య‌మై కోర్టులో సివిల్ కేసు విచార‌ణ‌లో ఉంద‌న్నారు.

ఆ భూమి ఐజీ నాగిరెడ్డి త‌న‌కు చెందాల‌నే ఉద్దేశంతో, జీపీ రెడ్డిని బెదిరించైనా భూమిని ద‌క్కించుకోవాల‌నే ఆలోచ‌న‌తో పోలీసుల‌ను ఉసిగొల్పార‌ని Lagadapati rajagopal ఆరోపించారు. మ‌రోప‌క్క ఈ భూమికి సంబంధించి గ‌తంలో జీపీ రెడ్డిపై కేసులు న‌మోదైన‌ట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా, త‌న మిత్రుడు జీపీ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాల‌కు సంబంధించి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చెప్పారు.

Related News