నిన్న ఉప్పల్ వేదికగా బెంగుళూరు వర్సెస్ హైదరాబాద్ లో మ్యాచ్ లో బెంగుళూరు పరాజయం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడంతో బెంగుళూరు కు ప్లే ఆఫ్ రేసులోంచి తొలగిపోయింది. చావో రేవో తేల్చుకొవాల్సిన మ్యాచ్ లో బెంగుళూరు ఆట గాళ్లు డీలా పడిపోయారు. ఛేజింగ్ లో ఎంత స్కోర్ ను అయినా కొట్టే సత్తా ఉన్న ప్లేయర్లు బెంగుళూరు టీం ఉన్నా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఈసిజన్ లో బెంగుళూరు 10మ్యాచ్ లు ఆడితే కేవలం 3 మ్యాచ్ లు మాత్రమే విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బెంగుళూరు ఐదు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. మ్యాచ్ అనంతరం తమ జట్టు ఆట తీరుపై కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్టార్ ప్లేయర్లు ఉన్నా తాము విజయం సాధించలేకపోయామన్నారు.
ఓటమిని తామే కొనితెచ్చుకుంటున్నామన్నాడు. తమ టీంకు విజయం లేక చాలా రోజులయ్యిందన్నారు. మొదట్లో బానే ఆడి..ఆడాల్సిన టైం లో మొత్తం బాల్స్ అన్ని వేస్ట్ చేశామన్నారు. తమ బౌలర్లు ఒక 15పరుగులు తక్కు వ ఇచ్చి ఉంటే గెలిచేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశాడు. చేతిలో నాలుగు వికెట్లు ఉంచుకుని విజయానికి అవసరమైన 5పరుగులు కూడా చేయలేకపోయామన్నారు. వాస్తవానికి ఇది సన్ రైజర్స్ గెలుపు అనడం కన్నా బెంగుళూరు ఓటమి అనాలన్నారు. ఎదిఎమైనా ఒత్తిడిలో కూడా అంతా బాగా ఆడినందుకు హైదరాబాద్ జట్టును ప్రశంసించాడు. బెంగుళూరు ఆడే మిగతా నాలుగు మ్యాచ్ లు గెలిసినా ఎం ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు కెప్టెన్ విరాట్ కోహ్లి.